రంగారెడ్డి జిల్లాలో నగల కోసం మహిళా దారుణ హత్య?
ఓ మహిళ మృత దేహం మూటలో కట్టి రోడ్డుపై పడేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపు తుంది. ఈరోజు ఉదయం తెల్లవారు జామున బయ టకు వచ్చిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళన చెందారు. కాలనీలో ఒక మూట కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాస కాలనీకి చేరుకు న్నారు. మూట ఉండటం చూసి క్లూటీంకు రప్పిం చారు. మూటను తీసి చూడగా పోలీసులకు మహిళా మృత దేహం కనిపించింది.మూటలో ఓ మహిళ మృతదేహం ఉండటం, మహిళ ముక్కు, చెవులు కోసేసి బంగారు ఆభర ణాలు చోరీ చేశారని గుర్తించారు. కమ్మలను తీసుకునేందుకు చెవులు కత్తిరించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఎక్కడో హత్య చేసి, మూట లో కట్టి అర్థరాత్రి కాలనీలో పడేసి వెళ్లిన ఆనవాళ్ళు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులతో పాటు క్లూస్ టీమ్ ఆధారాలు కోసం ప్రయత్నిస్తున్నారు.