మాచారెడ్డి ప్రశ్నా ఆయుధం న్యూస్ జూలై25
మాచారెడ్డి మండలంలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందినట్లు మాచారెడ్డి ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. అంకిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోగల మఠంరాళ్ల తండాకు చెందిన ప్రమీల తన పొలానికి సద్ది గంప తీసుకొని వెళ్తుండగా ప్రమాదం జరిగిందన్నారు.గంపపై ఉన్న గొడుగుకు విద్యుత్ వైర్లు తగలడంతో ప్రమీల విద్యాదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు వివరించారు..