ఫుట్ పాత్ లపై జిహెచ్ఎంసి అధికారుల కొరడా,
మేడ్చల్ జిల్లా / ఉప్పల్
ఫిబ్రవరి 7
ఉప్పల్ జిహెచ్ఎంసి పరిధిలోని చిలుకానగర్ ప్రాంతంలో ఫుట్ పాత్ లపై అధికారుల కొరడా జులిపించారు, ఫుట్ ఫాత్ పై ఉన్నా ఆక్రమనలు తొలగిస్తున్న క్రమంలో బత్తిని రాధిక అనే మహిళా తన 20 ఏళ్లుగా నడిపిస్తున్నా పాలబూత్ ను అధికారులు అన్యాయంగా కూల్చివేస్తున్నారని పెట్రోల్ బాటిల్ తో ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది, జిహెచ్ఎంసి వాహనాలకు,జెసిపికి అడ్డుగా కూర్చొని నిరసన తెలిపింది, కళ్యాణపురి పార్క్ దగ్గర గత 20 సంవత్సరాల నుండి పాల బూతు నడిపిస్తున్నా,ట్రీడింగ్ లైసెన్స్ ఉంది,18 సంవత్సరాల నుండి ప్రతి నెల కరెంట్ బిల్లు కడుతున్నా నాకు ఇద్దరు పిల్లలు ,భర్త చనిపోయాడు ,పాల భూత్ మీదనే బ్రతుకుతున్నా, ఇక్కడనే నివాసం ఉంటున్నాను, కొందరు బిల్డర్లు షెటర్లు వేసుకోవాలని స్వార్ధంతో ఎన్నోసార్లు బెదిరించినా కూడా బెదరలేదు, శుక్రవారం అధికారులు అధికారులు అన్యాయంగా నా పాలభూతును కూల్చివేశారు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నా పాలాభుత్ ను కుల్చివేయడమే కాకుండా పాల బూతులో ఉన్న ఫ్రిడ్జ్,పాలట్రేయ్ లు,ఇతర సామానులుతో జిహెచ్ఎంసి వాహనంలో వేశారు, నాకు న్యాయం జరగకపోతే పెట్రోల్ పోసుకొని చనిపోతానని జిహెచ్ఎంసి వాహనాలకు అడ్డుగా పెట్రోల్ డబ్బతో కూర్చొని నిరసన తెలియజేసింది. ప్రతిరోజు ఇల్లు ఇల్లు కు తిరిగి పాల ప్యాకెట్లు వేసుకుంట్టు జీవనం కొనసాగిస్తున్నా,నాకు జీవనోపాధి లేకుండా చేశారని నా జీవితాన్ని రోడ్డుపాలు చేశారని నాకు న్యాయం చేయాలని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు.