పల్లెపహాడ్ లో మహిళా సమైఖ్య సంఘం..!

మహిళా
Headlines:
  • Women Unite for Safety: New Women’s Association Established in Pallepahad
  • Local Leaders Launch Women’s Association to Combat Injustice

గజ్వేల్ అక్టోబర్ 27 ప్రశ్న ఆయుధం :

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ అండ్ ఆర్ కాలనీ పల్లెపహాడ్ గ్రామంలో మహిళల భద్రతకు, మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడానికి మహిళలు ఏకమై ఉండి అభివృద్ధి పథం వైపు అడుగులు వేయాలని ఆదివారం రోజు పల్లెపహాడ్ గ్రామంలో జాతీయ మహిళా సమైక్య సంఘం జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ మరియు సిపిఐ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి శివలింగు కృష్ణ ఆధ్వర్యంలో నూతన మహిళా సమైక్య సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘంలో అధ్యక్షురాలుగా శివలింగు లక్ష్మి, ఉపాధ్యక్షురాలుగా గూడూరి యాదవ్వ మరియు సహాయ కార్యదర్శిగా మడుగూరి లావణ్య ను ఎన్నుకోవడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు స్వరం రాజేశం, కొండకింది పోచయ్య, కొండి రాజం, రుద్రారం బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now