Site icon PRASHNA AYUDHAM

మహిళా ఆరోగ్యం: మేడ్చల్ జిల్లాలో 12 రోజుల ఉచిత వైద్య శిబిరాలు

IMG 20250916 WA0012

మహిళా ఆరోగ్యం: మేడ్చల్ జిల్లాలో 12 రోజుల ఉచిత వైద్య శిబిరాలు

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 16

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో మహిళల ఆరోగ్యం మెరుగుపర్చడం లక్ష్యంగా కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు (ప్రభుత్వ సెలవులు మినహా) మొత్తం 12 రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.

ఈ కార్యక్రమాన్ని ఆల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద గౌరవ అతిథులు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 121 ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయబడ్డాయి. వీటిలో రోజుకు 11 క్యాంపులు చొప్పున నిర్వహించనున్నారు.

శిబిరాల్లో లభించే సేవలు:

* నిపుణుల సేవలు: ప్రసూతి, చిన్నపిల్లల వైద్యం, కంటి, దంత, చర్మ, చెవి-ముక్కు-గొంతు, సైకియాట్రీ వంటి విభాగాలకు చెందిన నిపుణులు అందుబాటులో ఉంటారు.

* ఉచిత పరీక్షలు: బీపీ, షుగర్, క్యాన్సర్, టిబి, హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహిస్తారు.

* గర్భిణీలు, బాలింతలకు: ప్రత్యేక వైద్య పరీక్షలు, ఉచిత మందులు, కౌన్సిలింగ్, అవసరమైతే ఉన్నత ఆసుపత్రులకు రిఫరల్ సౌకర్యం కల్పిస్తారు.

* పోషణ మరియు మానసిక ఆరోగ్యం: రక్తహీనత చికిత్స, పోషకాహారంపై అవగాహన, బలహీనంగా ఉన్న పిల్లలకు వైద్యం, మానసిక ఆరోగ్యంపై కౌన్సిలింగ్ వంటి సేవలు అందిస్తారు.

* కిషోర బాలికలకు: ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమం విజయవంతానికి మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖలు సహకరిస్తున్నాయి. జిల్లాలోని మహిళలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Exit mobile version