*బస్సు సీటు కోసం మరోసారి కొట్టుకున్న మహిళలు*
వనపర్తి జిల్లా: జనవరి 10
ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆర్టీసీ బస్సులు నిత్యం కిక్కరిసి పోతున్నాయి. బస్సులో సీటు చాలా చోట్ల అందని ద్రాక్షలా మారిపో యింది. ఈ క్రమంలో పలు చోట్ల ఘర్షణలు జరుగుతు న్నాయి. తాజాగా ఈ ఘట న వనపర్తి జిల్లా గణపురం బస్టాండ్ లో గురువారం సాయంత్రం జరిగింది,
బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం జరగడంతో బస్సులోంచి దిగి ఒకరి నొకరు జుట్టు పట్టుకుని చీపురు కట్టలతో కొట్టుకున్నారు. పక్కనే ఉన్న తోటి ప్రయాణికులు ఆపడానికి ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది.