మహిళలు సంప్రదాయబద్ధంగా ఉండాలి
బొట్టు, గాజులు మహిళలకు ఆభరణమే కాదు — ఆత్మగౌరవ ప్రతీకలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 10
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ మహిళలు శుక్రవారం ఒకచోట చేరి ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి గాజులు సమర్పించి, ఒకరికొకరు పారానితో చేతులను అలంకరించుకున్నారు. అనంతరం పరస్పరం బొట్టు పెట్టుకొని, గాజులు ధరించి స్నేహభావంతో మెలగాలని సంకల్పించారు. తెలుగింటి ఆడపడుచులు సంప్రదాయబద్ధంగా ఉండి భారతీయ సంస్కృతిని నిలబెట్టాలని ప్రతిజ్ఞ చేశారు. మహిళలు పంచాగ్నిలాంటి విలువలను కాపాడడమే దేశ అభివృద్ధికి మూలమని వారు పేర్కొన్నారు.