మహిళలు ఆర్థికంగా ఎదగాలి

*మహిళలు ఆర్థికంగా ఎదగాలి*

*మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్*

*జమ్మికుంట జూలై 1 ప్రశ్న ఆయుధం*

ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని, వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా మున్సిపల్, మెప్మా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అన్నారు. మంగళవారం రోజున మున్సిపాలిటీ పరిధిలోని అర్పిలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అర్పిల అందుబాటులో ఉన్న సంఘ సభ్యులను ఏదైనా పనిలో నిమగ్నమయ్యే విధంగా చూడాలని ఆదేశించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మున్సిపాలిటీ పరిధిలో కొన్ని యూనిట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని అందులో ముఖ్యంగా దోభి, వాటర్ ప్లాంట్ వంటి యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ అయాజ్ తెలిపారు ప్రతి ఒక్కరు చెత్త సేకరణలో భాగస్వాములు అయ్యే విధంగా చూడాలని, హోమ్ కంపోస్టు తయారీ ప్రతి ఆర్పీ ఐదు చొప్పున లక్ష్యంగా తీసుకొని ఇంటి వద్దనే హోమ్ కంపోస్టు చేయాలన్నారు రానున్న వర్ష కాలంలో వీలున్న ప్రతి ఇంటి వద్ద కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసే విధంగా చూడాలని ప్రతి ఆర్పీ తమ సభ్యులతో బర్తన్ బ్యాంకు (ఫంక్షన్ కు ఉపయోగపడే వంట సామాగ్రి) చిన్న చిన్న కార్యక్రమాలకు ఉపయోగించేలా చూడాలని మహిళల వల్లనే మున్సిపాలిటీ జీరో ప్లాస్టిక్ సాధ్యమవుతుందని, ఈ విషయాన్ని ప్రతి సంఘ సభ్యులకు వివరించి, వారు ప్లాస్టిక్ వాడకుండా ఉండేలా చూసుకోవాలని సంఘ సభ్యులకు లోన్ ఇప్పించడం, సంఘంలో లేని వారిని గుర్తించి వారిని సంఘంలో ఉంచి వారికి కూడా లోన్ ఇప్పించాలన్నారు. సి ఐ జి గ్రూప్ లు ప్రతి ఆర్పీ గుర్తించి, వాటిని బ్యాంకులలో ఖాతాలు తీసి వారికి లోన్ ఇప్పించాలన్నారు సంఘంలోని సభ్యులు లోన్ తీసుకొని కట్టని వారిని గుర్తించి లోన్ రికవరీ చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మెప్మా ఎడిఎంసి మల్లీశ్వరి, శానిటరీ ఇనస్పెక్టర్ మహేష్, సదానందం, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ శ్రీకాంత్, సి.ఎల్. అర్పిలు జ్యోతి, మంజుల, టి.ఎల్.ఎఫ్.ఆర్పీ సరళ, అర్పిలు పలువురు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment