*ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం*
*హుజురాబాద్ జనవరి 3 ప్రశ్న ఆయుధం*
హుజరాబాద్ పట్టణం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు దేవారం మేరీ శోభారాణి ఆధ్వర్యంలో శుక్రవారం రోజున సావిత్రిబాయి పూలే జన్మదిన పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మొదట సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలవేసి సావిత్రిబాయి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు మహిళ విద్యాభ్యాసం కొరకు సావిత్రిబాయి చేసిన సహాసాలను కొనియాడారు మహిళ ఉపాధ్యాయులను శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో అమ్మా ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ కొలిపాక సునిత, ఉపాధ్యాయులు వూరుకొండ సత్యప్రసాద్ తిరుణహరి పవన్ కుమార్ ఎం ఫ్రాన్సిస్ అరిగెల సమ్మయ్య, కె సంజీవయ్య, జీ రాజ్యలక్ష్మి, బుక్క నాగమణి ,రజిత, అంజలి,బి అనిత , మంగళంపల్లి సంపత్, సి హెచ్ రాజేష్ ,చంటి, రెండ్ల వెంకటేష్ ,సి హెచ్ అరుణ్ కుమార్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.