జిల్లా ఆసుపత్రిలో మహిళా దినోత్సవ వేడుకలు

జిల్లా ఆసుపత్రిలో మహిళా దినోత్సవ వేడుకలు

– మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు

– ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అన్నపూర్ణ
గజ్వేల్, 08 మార్చి 2025 : మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ అన్నారు. శనివారం గజ్వేల్ లో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో శాంతి సేన అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మిస్ హైదరాబాద్ ఎన్నికైన జ్ఞానేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అన్నపూర్ణ, మిస్ హైదరాబాద్ జ్ఞానేశ్వరి మాట్లాడుతూ మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, భయాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో మహిళలు ముందు సాగాలని సూచించారు. పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వెళ్తున్నారని, భవిష్యత్తులో మహిళలు ఈ తల్లిదండ్రులకు కొడుకులు లేని లోటు తీర్చే విధంగా తయారు కావాలని తెలిపారు. సృష్టికి మూలం ఒక మహిళ అని ఈ ప్రపంచంలో వెలుగునిచ్చేది స్త్రీ, స్త్రీ లేనిదే మానవతా మనవడా లేదన్నారు. మహిళలకి ముఖ్యంగా విద్యార్థులకు తల్లిదండ్రుల నుండి సమాజం నుండి సహకారం పూర్తిగా లభించాలని ఆ విధంగా సపోర్ట్ దొరికినప్పుడు ఏ స్థాయికి అయినా మహిళలు వెళ్లగలుగుతారు అని నేడు మహిళల మీద జరుగుతున్న అనేక హింస కాండము ఎదుర్కొనే విధంగా ఆడపిల్లలను పెంచాలని ఆడపిల్లలు ప్రతి రంగంలోనూ అభివృద్ధి చెందాలని వీరికి కుటుంబంతో పాటు తోటి ఉద్యోగులు సహకారం కూడా పూర్తిగా కావాలని సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. శాంతి సేన అధ్యక్షులు నెహ్రూ యువ కేంద్ర ముఖ్య సలహాదారు చంటి మాట్లాడుతూ మహిళా దినోత్సవం అనేది వేడుకగా జరుపుకుంటున్నాము కానీ అది ఒక ఉద్యమం నుంచి పుట్టినది అమెరికాలోని న్యూయార్క్ లో ప్రారంభమైన ఉద్యమం పనికి తగిన వేతనాన్ని ఇవ్వాలి అని ఆనాటి మహిళలు సాధించుకున్న ఉద్యమమే ఈనాడు మన మహిళలంతా జాతీయస్థాయిలో మహిళా దినోత్సవం గా జరుపుకుంటున్నారు అని తెలియజేశారు. ముఖ్యంగా ప్రతి మహిళ తన కుటుంబ వ్యవస్థను బాగు పరచుకుంటూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జయశ్రీ, డాక్టర్ మంజుల, డాక్టర్ త్రివేణి, డాక్టర్ సమీక్ష, నర్సింగ్ ఆఫీసర్స్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now