పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
గజ్వేల్, 08 మార్చి 2025 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శనివారం ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థులు 1983 – 84 సంవత్సరం 10వ తరగతి విద్యార్థుల ఆధ్వర్యంలో మహిళా మణులకు శాలువాలతో సత్కరించి ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పూర్వ మహిళ విద్యార్థినిలు వంటేరు ఉమా, నాగలక్ష్మి, బాల లక్ష్మి, నేతి పద్మ, దొంతుల లక్ష్మి, తేరాల పద్మ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో మమ్మల్ని సన్మానించినందుకు సంతోషంగా ఉందని, స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అంటూ, అందరం కలిసి ఉంటూ, వివిధ ప్రత్యేక సందర్భాల్లో కలుస్తూ, మేమంతా సంతోషంగా ఉంటున్నామని, అందులో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరం కలవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యగారి శ్రీనివాస్, గుంటుకు యాదగిరి, ఎన్సీ శ్రీనివాస్, గందె రమేష్, దొంతుల యాదగిరి, భాగయ్య, అంబాదాస్, రవీందర్, రాజేశ్వర్ రెడ్డి, వంటేరు గోపాల్ రెడ్డి, తేరాల బాలేందర్ తదితరులు పాల్గొన్నారు.