నిధులు మంజూరు కాకుండానే పనులు ప్రారంభం !
ప్రధాన రహదారిపై గుంతలతో వాహనదారులు ఇక్కట్లు ?
అంతా మా ఇష్టమే అంటూ వ్యవహరించడమే ప్రధాన కారణం..!
జిల్లాస్థాయి అధికారుల అనుమతులు లేకుండానే పనులు ప్రారంభం..!
కాంట్రాక్టుల కోసమే పని చేస్తున్న ఆర్ అండ్ బి డిఈ..?
భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి జనవరి 6 (ప్రశ్న ఆయుధం )
కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని అన్నపరెడ్డిపల్లి మండల పరిధిలోని అన్నపరెడ్డిపల్లి నుండి కొత్తగూడెం వెళ్లే మార్గం మధ్యలో ఉన్న అబ్బుగూడెం సమీపంలో ఉన్న ఆర్ అండ్ బి ప్రధాన రహదారి సుమారు రెండు కిలోమీటర్ల పరిధి రోడ్ల మరమ్మతుల కోసం అధికారులు ఎలాంటి నిధులు లేకుండానే పనులు ప్రారంభించడం జరిగింది. ఇటువంటి పనులను చేయించాలని కొందరు కాంట్రాక్టర్లు ఏదో రకంగా నిధులను మంజూరు చేయించాలని ప్రస్తుతం ఉన్న రహదారిని జెసిబి యంత్రాలతో ధ్వంసం చేయించి గుంతల గుంతలుగా తయారు చేయించారు దీంతో పలు వాహనదారులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్న నిధులు కావడం లేదని ఆర్ అండ్ బి డిఈ పలుమార్లు జిల్లా స్థాయి అధికారులు వద్దకు వెళ్లి అడిగిన ప్రయోజనం కనిపించడం లేదని తేటతెల్లమవుతుంది నిజానికి కొందరు కాంట్రాక్టర్లు అధికారులతో కుమ్మక్కై ప్రస్తుతం ఉన్న రోడ్డును ఏదో రకంగా లక్షల రూపాయల నిధులను వినియోగించాలని కంకణం కట్టుకొని అశ్వరావుపేట డివిజనల్ ఇంజనీరింగ్ అయినా అధికారిపై ఒత్తిడి తీసుకురావడంతో ప్రయోజనం లేకుండా పోతుందని కొందరు ఆయా శాఖ సంబంధించిన అధికారులే తెలుపుతున్నారు నిజానికి ప్రభుత్వ పనులు గుర్తించి వాటికి నిధులు మంజూరు చేసిన పిమ్మటే పనులను కొనసాగించాలి కానీ కాంట్రాక్టులు కక్కుర్తి అధికారుల ముడుపులకు దాసోహంతో వాహనదారులకు శాపంగా మారిందని తెలుస్తుంది ఏది ఏమైనా అశ్వరావుపేట నియోజకవర్గం లోని వివిధ రకాల శాఖలకు సంబంధించిన అధికార యంత్రాంగం విధులపై నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రజల ప్రాణాల మీదకు వస్తుందని పట్టించుకోని నాధుడు లేక గుంతల రోడ్డులో పలువురులు ప్రమాదాలకు గురై హాస్పిటల్ లో చేరిన సందర్భాలు లేకపోలేదని ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ఇలాంటి అధికారులను విధుల నుంచి తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని అశ్వరావుపేట నియోజకవర్గం ప్రజలు కోరుకుంటున్నారు