గెలుపే లక్ష్యంగా పనిచేయాలి ..
దిశా నిర్దేశం చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్ ..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు ఎంపీ ధర్మపురి అరవింద్ దిశా నిర్దేశం చేశారు. నాందేడ్ జిల్లా ఇన్చార్జిగా ఎంపీ ధర్మపురి అరవింద్ కు బాధ్యతలు అప్ప జెప్పిన నేపథ్యంలో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నాం దేడ్ జిల్లా ప్రభారి హోదాలో ఏర్పాటు చేసిన 9 అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నాయకుల సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. ఎంపీ ధర్మపురి అరవిందు కు నాందేడ్ జిల్లా బిజెపి నాయకులు పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా ఇన్చార్జిగా బిజెపి నాయకులకు కార్య కర్తలకు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ధర్మపురి అరవింద్ పిలుపు నిచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో ప్రతీ కార్యకర్త అవ గాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి అశోక్ చవాన్, రాజ్యసభ సభ్యులు మరట్వాడ ప్రభారీ భాగవత్ జీ కరాడ్, మర ట్వాడ విభాగ సంఘటన మంత్రి సంజయ్ జీ కౌడ్గేమాజీ పార్లమెంట్ సభ్యులు ప్రతాప్ రావు పాటిల్ చిక్లీకర్, శ్రీ రామ్ పాటిల్ రాథోళీకర్ , శ్రీ దేవిదాస్ రాథోడ్, నాందేడ్ దక్షిణ, ఉత్తర జిల్లాల అధ్యక్షులు సంతు ల్ రావ్ హంబరడే, కిషోర్ దేశ్ ముఖ్, మహి ళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పూనమ్ పవార్ తదితరులు పాల్గొన్నారు.









