హీరోలకు రూ.100 కోట్లు.. మాకు వేతనాలు పెంచలేరా?: కార్మికులు
టాలీవుడ్లో నిర్మాతలకు, ఫెడరేషన్కు మధ్య వివాదం ఇంకా సద్దుమణగలేదు.
సినిమాల్లో నటించే హీరోలకు రూ.100 కోట్లు ఇస్తున్నారని, తమకు వేతనాలు పెంచితే నష్టమేంటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
సాఫ్ట్వేర్ వాళ్లకు నెలకు జీతం వస్తుందని, తమకు నెలలో సగం రోజులే పని దొరుకుతుందని చెబుతున్నారు.
ముంబై టెక్నీషియన్లను తీసుకొచ్చేందుకు పెట్టే ఖర్చులో కనీసం సగం తమకు ఇచ్చినా తమ బతుకులు మారతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.