Site icon PRASHNA AYUDHAM

సొరంగం పైకప్పు కూలి కార్మికుల గాయాలు

IMG 20250222 WA0105

*సొరంగం పైకప్పు కూలి కార్మికుల గాయాలు*

నాగర్ కర్నూల్: ఫిబ్రవరి 22

ఎస్ ఎల్ బీసీ టన్నెల్ వద్ద శనివారం ఉదయం ప్రమా దం సంభవించింది, నాగర్ కర్నూలు జిల్లా దోమల పెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ సొరంగం పై కప్పు కూలడంతోఈ ప్రమాదం జరిగింది

నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఉన్న ఎడమ గట్టు కాలువ 14వ కిలోమీటర్ వద్ద మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఉదయం 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నా రు.

ఇటీవల సోరంగం పనులు ఆపి మళ్లీ తిరిగి 4 రోజులు క్రితం పనులను ప్రారంభిం చారు. పైకప్పు ఊడిపడటం తో స్వల్ప గాయాలతో కొంత మంది కార్మికులు బయటపడ్డారు. వారిని అక్కడి సిబ్బంది ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడగా మరికొంత మంది కార్మికులు లోపల ఉన్నట్లు అధికారులు అను మానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరిన నీటిపారుదల శాఖ అధికారులు ఘటనపై వివరాలు ఆరా తీస్తున్నారు.

Exit mobile version