పనిచేసే వర్కర్లకు పనివేళలో చట్టబద్ధ హక్కులు కల్పించాలి

*

వ్యాపారుల వద్ద పనిచేసే వర్కర్లకు పని వేళలలో చట్టబద్ధహక్కులు కల్పించాలి

షాపింగ్ మాల్స్ ఇతర వాణిజ్య వ్యాపారుల వద్ద పనిచేసే వర్కర్లకు పని వేళలు చట్టబద్ధ హక్కులు అమలు చేయాలి*

 

లేబర్ ఇన స్పెక్టర్ బి. నాగరాజు కి వినతి పత్రం అందజేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావు

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి అక్టోబర్ 28

మణుగూరు ప్రాంతంలో వివిధ షాపింగ్ మాల్స్ వాణిజ్య వ్యాపారులు కార్ఖానాలలో పనిచేస్తున్న వర్కర్లకు పనివేళలో వారాంతపు సెలవు జీవో ప్రకారం కనీస వేతనం చట్టబద్ధ హక్కులు అమలు చేయాలని కోరుతూ సోమవారం నాడు మణుగూరు కార్మిక శాఖ అధికారి బి నాగరాజు కి ఆయన కార్యాలయంలో వినతిపత్రం అందజేసినట్లు సామాజిక సేవకులు కర్నే బాబురావు విలేకరులకు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు పట్టణంలో వివిధ షాపింగ్ మాల్స్ వాణిజ్య మరియు వ్యాపారుల వద్ద షో రూమ్ లలో పనిచేసే వర్కర్లకు కార్మిక చట్టాల నిబంధనల ప్రకారం పని వేళలు అమలు కావడం లేదనీ రోజుకి 10 లేదా 12 గంటలు ఆ పైచిలుకు పని చేయించుకోవడమే కాకుండా ఆదివారం మరియు రాష్ట్ర , జాతీయ సెలవు దినాలలో కూడా వీరితో పని చేయించుకుంటున్నారని మహిళల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదని దయచేసి పట్టణంలో షాపులలో షోరూం లలో, వాహన మరమ్మత్తుల షెడ్లలో పనిచేస్తున్న అందరికీ పని వేళలు అమలు చేయించాలని అలాగే నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లించే విధంగా తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నామన్నారు.భీమ పథకాలు కూడా వర్తింపచేయాలని ఆ వినతి పత్రంలో కోరినట్లు కర్నే బాబురావు తెలిపారు.

Join WhatsApp

Join Now