*వడ దెబ్బ పట్ల కార్మికులు అప్రమత్తంగా ఉండాలి*
*హెల్త్ ఎడ్యుకేటర్ ఏ మోహన్ రెడ్డి*
*జమ్మికుంట ఏప్రిల్ 15 ప్రశ్న ఆయుధం*
వేసవి ఎండల తీవ్రతలకు ఉష్ణ గ్రతలు పెరగటం వల్ల కార్మికులు వడ దెబ్బకు గురయ్యే అవకాశం వుంది కాబ్బటి కార్మికులు అప్రమత్తంగా ఉండాలని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ ఎడ్యుకేటర్ ఎ మోహన్ రెడ్డి అన్నారు.
మంగళవారం రోజున జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జమ్మికుంట పట్టణంలోని ఇటుక బట్టీలలో పనిచేసే కార్మికులకు వడ దెబ్బ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినారు. ఈ అవగహన కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి ఇటుక బట్టి కార్మికులకు వడ దెబ్బ లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలను క్లుప్తంగా వివరించి చెప్పినారు. వడ దెబ్బ నివారణకై ప్రజలు కార్మికులు అందరూ రోజుకి 10 గ్లాసుల కన్నా ఎక్కువ నీరు త్రాగాలని, బయటికి వెళ్లి నప్పుడు గొడుగు, టోపీ, తలపాగ, తెల్లని కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు. ఉదయం సాయంత్రం ఎండ లేని సమయంలో పనులు చేసుకోవాలని కార్మికులకు సూచించారు. ఎండ వేడిమికి డి హై డ్రె షన్ కాకుండా ఉండడానికి ఓ ఆర్ ఎస్ ద్రావణాన్ని త్రాగాలని సూచించారు. అనంతరం ఇటుక బట్టి కార్మికులందరికీ వారి పాకెట్స్ ని పంపిణీ చేసినారు.
ఈ కార్యక్రమములో హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, హెల్త్ సూపర్వైజర్ అరుణ ఏఎన్ఎం రజిత హెల్త్ అసిస్టెంట్ నరేందర్ ఆశ రహిమా సుల్తానా తదితరులు పాల్గొన్నారు