కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి – నాయిని సూచన..

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి – నాయిని సూచన..

టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డితో భేటీ

పార్టీ బలోపేతమే లక్ష్యంగా సమిష్టి చర్యలకు పిలుపు

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చొచ్చుకుపోవాలన్న సూచన

కామారెడ్డి పార్టీ పరిస్థితిపై ప్రత్యేకంగా విచారణ

ఉమ్మడి కరీంనగర్ ఇంచార్జ్‌గా సమీక్షించిన నాయిని

హైదరాబాద్, జూలై 30 (ప్రశ్న ఆయుధం):

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి నేత తన స్థాయిలో కృషి చేయాలని, అలాగే ప్రభుత్వ పథకాలను సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సూచించారు.

బుధవారం హైదరాబాద్‌లో నాయిని రాజేందర్ రెడ్డిని టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు పార్టీ విషయాలపై చర్చ జరిగింది. పార్టీ అభివృద్ధి, కార్యకర్తల చైతన్యం పెంపు, పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచే దిశగా కృషి చేయాలని నాయిని తెలిపారు.

కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై కూడా నాయిని రాజేందర్ ప్రత్యేకంగా ఆరా తీసినట్లు గడ్డం చంద్రశేఖర్ పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం నియోజకవర్గాల వారీగా సమీక్షలు, నాయకులతో సన్నిహితంగా కూచునే విధానంపై చర్చ సాగిందన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment