ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు

*వావిలాల ప్రాథమిక హెల్త్ సెంటర్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు*

*తల్లిపాలు బిడ్డకు శ్రీరామరక్ష…*

*డాక్టర్లు సంధ్య హిమబిందు మహోన్నత…*

*జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 2*

తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని ఆరోగ్య ఉప కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు జరుగుతాయని డాక్టర్లు తెలిపారు అందులో భాగంగా శుక్రవారం మండలంలోని మడిపల్లి శంభునిపల్లి కోరపల్లి జమ్మికుంట-2 ఆరోగ్య ఉప కేంద్రాలలోనీ అంగన్వాడీ కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలు జిల్లా కలెక్టర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శుక్రవారం సభ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్లు సంధ్య హిమబిందు మహోన్నత మాట్లాడుతూ పాలిచ్చే తల్లులకు తల్లిపాల అవశ్యకతను శిశువు జన్మించిన నాటి నుండి ఆరు నెలల వరకు ప్రత్యేకంగా తల్లిపాలు ఇవ్వాలని అన్నారు ఒకవేళ తల్లిపాలు రానప్పుడు వైద్యులు సూచించిన ఫార్ములా పాలను వాడాలని తల్లులు సరైన పోషకాహారం తీసుకుంటూ చనుబాల ఉత్పత్తిని పెంచుకోవాలని తెలిపారు ఆరు నెలల తర్వాత ఇతర ఆహార పదార్థాలను శిశువుకు అందిస్తూ తల్లిపాలను సంవత్సరం వరకు కొనసాగించాలని తల్లిపాలు తాగితేనే శిశువుకు సరైన పోషణ లభిస్తుందనీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది శిశువు ఆరోగ్యంగా ఉంటారనీ చనుబాలు ఇవ్వడమే మొదటి ప్రాధాన్యతగా భావించాలని సూచించారు మహిళలు పౌష్టికాహారం తీసుకోవాలని గర్భిణీలు బాలింతలు అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత డ్రై డే పాటించడం వల్ల అనారోగ్య సమస్యలు దరి చేరవని ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు
అలాగే వర్షాకాలంలో సంభవించే వ్యాధుల మీద వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత డ్రైడే మీద అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు సంధ్య హిమబిందు మహోన్నత హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి సూపర్వైజర్లు అరుణ సదానందం అంగన్వాడి సూపర్వైజర్ శిరీష ఏఎన్ఎం వనజ సంధ్య రజిత మణెమ్మ మంజుల అంగన్వాడి టీచర్లు భోగ కరుణ తిరుపతమ్మ కవిత సిఏలు అంగన్వాడి సిబ్బంది ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now