2024 ప్రపంచ వికలాంగుల దినోత్సవ వేడుక ల్లో పాల్గొన్న ఈటెల రాజేందర్ & వడ్డేపల్లి రాజేశ్వరరావు

వికలాంగుల
Headlines :
  1. 2024 వికలాంగుల దినోత్సవ వేడుకలలో ఈటెల రాజేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు
  2. వికలాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని భరోసా ఇచ్చిన ఈటెల రాజేందర్
  3. దివ్యాంగులకు వీల్ చైర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు అందజేత
  4. కూకట్‌పల్లి దివ్యాంగుల కార్యక్రమంలో వడ్డేపల్లి రాజేశ్వరరావు కీలక పాత్ర
  5. 2024 వికలాంగుల దినోత్సవ వేడుకలు – దివ్యాంగుల హక్కుల కోసం పోరాటానికి దృఢ నిశ్చయం

2024 ప్రపంచ వికలాంగుల దినోత్సవ వేడుక ల్లో పాల్గొన్న ఈటెల రాజేందర్ & వడ్డేపల్లి రాజేశ్వరరావు

ప్రశ్న ఆయుధం డిసెంబర్ 07: కూకట్‌పల్లి ప్రతినిధి

2024 ప్రపంచ వికలాంగుల దినోత్సవ వేడుకలు కూకట్ పల్లీ నియోజకవర్గం న్యూ శక్తి దివ్యంగుల సంస్థ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ విచ్చేశారు, ఎంపి ని న్యూ శక్తి వికలాంగుల సంస్థ అధ్యక్షులు వెంకటస్వామి, కార్యదర్శి చిరంజీవి మరియు సభ్యులు వారికి స్వాగతం పలికి ఈటెల రాజేందర్ ని సన్మానించారు, అనంతరం రాజేందర్ మాట్లాడుతూ అంగవైకల్యం ఉన్న వారు వికలాంగులు కారు దివ్యంగులు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వికలాంగులను గౌరవించారు, ప్రభుత్వ ఉద్యోగాలలో వికలాంగులకు రిజర్వేషన్లు వాటాను పెంచి మానసికంగా వారికి ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి ని వారు తెలియజేశారు, గతంలో అనేకసార్లు దివ్యాంగుల సమస్యలపై నేను పోరాటం చేశానని మరియు భవిష్యత్తులో కూడా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి భరోసా ఇస్తున్నాను అని ఈటెల రాజేందర్ తెలియజేశారు,

 కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు దివ్యాంగులకు వీల్ చైర్ లను, మూడు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాలను దివ్యాంగులకు అందజేశారు , ఈ కార్యక్రమంలో కూకట్ పల్లీ అసెంబ్లీ ఇంచార్జ్ మాధవరం కాంతారావు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, డివిజన్ అధ్యక్షులు, ఇతర సంఘాల నాయకులు మరియు దివ్యాంగుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now