బెజ్జంకి లో ఘనంగా ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు

*బెజ్జంకి లో ఘనంగా ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు*

 ప్రపంచ మత్స్యకార దినోత్సవం ను పురస్కరించుకొని బెజ్జంకి మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు అక్కరవేణి పోచయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో గురువారం రోజున మండల కేంద్రంలోని పెద్దమ్మ తల్లి దేవాలయ ఆవరణలో వివిధ గ్రామాలకు చెందిన ముదిరాజ్ కులస్తులు వారి కుల జాతి జెండాను ఎగురవేసి, ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా పోచయ్య ముదిరాజ్ మాట్లాడుతూ, మత్స్యకారులకు ప్రపంచం లోనే ఎంతో గౌరవం ఉందని, ముదిరాజ్ లు అంతా ఐకమత్యం గా ఉండి మన హక్కుల సాధనకు కృషి చేయాలని, ప్రజలు ఆహారంగా విటమిన్లు పుష్కలంగా ఉన్న చేపలను తిని, ఆరోగ్యంగా ఉండాలని కోరారు. అనంతరం బస్టాండ్ చౌరస్తా లో సుమారు 200 మందితో బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీలాపూర్ తాజా మాజీ సర్పంచ్ రావుల మొండయ్య ముదిరాజ్, ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు కొర్వి తిరుపతి ముదిరాజ్, రావుల రాజు ముదిరాజ్, తాటికొండ రాజేందర్ ముదిరాజ్, దేవనబోయిన సంతోష్ ముదిరాజ్, టౌన్ అధ్యక్షులు రావుల కనకయ్య ముదిరాజ్, బర్ల రాజు ముదిరాజ్, యూత్ అధ్యక్షులు రావుల ప్రశాంత్ ముదిరాజ్, బొమ్మరవేణి వెంకటేష్ ముదిరాజ్, గూళ్ల సంపత్ ముదిరాజ్, కొత్తూరి కుమార్ ముదిరాజ్ వివిధ గ్రామాల ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment