Site icon PRASHNA AYUDHAM

ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం

IMG 20250908 WA0029

🌍 ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం

నిరక్షరాస్యులను నిర్మూలించాలన్న లక్ష్యంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న నిర్వహణ

1966లో యునెస్కో తీర్మానం – 1967 నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రారంభం

విద్య వ్యాప్తికి ప్రభుత్వాలు రాత్రి బడులు, అక్షరాస్యతా కార్యక్రమాలు అమలు

అన్ని వర్గాల్లో సంపూర్ణ అక్షరాస్యత సాధన దిశగా కృషి కొనసాగింపు

వ్యాపారవేత్త, సామాజిక సేవకుడు ఎం.శ్రీనివాస్ కుమార్ శుభాకాంక్షలు

హైదరాబాద్, సెప్టెంబర్ 8 (ప్రశ్న ఆయుధం):

ప్రపంచవ్యాప్తంగా నిరక్షరాస్యులను నిర్మూలించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం నిర్వహిస్తారని ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త ఎం.శ్రీనివాస్ కుమార్ తెలిపారు.

1966 అక్టోబర్ 26న యునెస్కో తీర్మానం చేసి, 1967 నుంచి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవం పాటించడం ప్రారంభమైంది. విద్యను అందరికీ చేరవేయడం, అన్ని వర్గాల్లో అక్షరాస్యత సాధించాలన్న లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు రాత్రి బడులు, ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి.

ఈ సందర్భంగా శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ, విద్యే సమాజానికి వెలుగునిస్తుందని, సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

 

 

Exit mobile version