ఈ రోజు కామారెడ్డిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగినవి…వీటిలో భాగంగా ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు…అనంతరం జరిగిన సమావేశంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా.చంద్రశేఖర్ , ఎం.హెచ్.ఎం.ప్రోగ్రాం ఆఫీసర్ డా.రాధిక , వైద్యాధికారి డా.సాయి ఈశ్వరి , వైద్య సిబ్బంది పాల్గొన్నారు… డా.చంద్రశేఖర్ ,డి.ఎం.హెచ్.ఓ. గారు మాట్లాడుతూ గర్భ ధారణ సమయ నిర్ణయం , సురక్షిత ప్రసవం గురించి చేపట్టవలసిన చర్యలు వివరించారు… కుటుంబ నియంత్రణ శాశ్వత పద్ధతులు , తాత్కాలిక పద్ధతుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.. కార్యక్రమంలో డి.ఎం.హెచ్.ఓ. డా.చంద్రశేఖర్, ప్రోగ్రాం ఆఫీసర్ డా.అనురాధ ,వైద్యాధికారి డా.సాయి ఈశ్వరి తో పాటు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నయీమ్ ఖాన్ , సురేష్, నాగభూషణం , మోనిక ,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు..