Headlines :
-
హైదరాబాద్ వేదికగా ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు
-
2025 జనవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరిగే కార్యక్రమం
-
2,000 మందికి పైగా ప్రతినిధులు పాల్గొననున్నట్లు సమాచారం
హైదరాబాద్ :
అంతర్జాతీయ తెలుగు మహాసభలకు హైదరాబాద్ మరోసారి వేదిక కానుంది. వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు
హైటెక్సిటీలోని HICCకాంప్లెక్స్, నోవాటెల్ కన్వెన్షన్ హాల్లో జరగనున్న ఈ మహాసభల్లో దేశ విదేశాలకు చెందిన 2వేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారు.
ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలను ఈసారి హైదరాబాద్లో నిర్వహిస్తునట్టు సమాఖ్య అధ్యక్షుడు ఇందిరాదత్ తెలిపారు.