Headlines
-
పురుగుల బియ్యం అంశంపై విద్యాశాఖ అధికారుల వివరణ
-
తప్పుడు ప్రచారం: విద్యాశాఖ అధికారుల ఖండన
-
ఎంఎల్ఎస్ పాయింట్ బియ్యంలో పురుగులు: ఏమి జరిగింది?
-
మధ్యాహ్న భోజనానికి పురుగుల బియ్యం వాడినట్లు లేదు
-
విద్యార్థుల ఆరోగ్యం పట్ల విద్యాశాఖ చిత్తశుద్ధి
–విద్యాశాఖ అధికారి రాజు
ప్రశ్న ఆయుధం న్యూస్, కామారెడ్డి :
కామారెడ్డి జిల్లా రామారెడ్డి జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో పురుగుల బియ్యం వార్తలపై జిల్లా విద్యాశాఖ అధికారి రాజు స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మూడు రోజుల క్రితం ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి మండలంలో అన్ని పాఠశాలలకు వచ్చిన బియ్యంలో పురుగులు ఉన్న మాట వాస్తవేమని పేర్కొన్నారు. అయితే ఆ బియ్యాన్ని మధ్యాహ్నం భోజనానికి ఉపయోగించే ముందు క్లీన్ చేయడం జరిగిందని తెలిపారు. వండిన మద్యాహ్న భోజనంలో పురుగులు రాలేదని పేర్కొన్నారు. అయితే కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ ప్రచారాన్ని జిల్లా విద్యాశాఖ ఖండిస్తుందని పేర్కొన్నారు. పురుగులు ఉన్న బియ్యాన్ని ఎంఈవో పరిశీలించి ఎంఎల్ఎస్ పాయింట్ కు తిరిగి పంపించి, మంచి బియ్యాన్ని పాఠశాలలకు పంపించినట్లు తెలిపారు.