Site icon PRASHNA AYUDHAM

ఆందోళన కలిగిస్తున్న సైబర్ దాడులు.. ప్రతి వారం వేలల్లో కేసులు

IMG 20250126 WA0111

ఆందోళన కలిగిస్తున్న సైబర్ దాడులు.. ప్రతి వారం వేలల్లో కేసులు

భారతదేశంలో సైబర్ దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజలను మోసగించి వారి ఖాతాల్లో సొమ్మును తస్కరించేందుకు ముష్కరులు శతవిధాలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఓ నివేదిక సైబర్ దాడుల జోరును విశ్లేషింది. ప్రతి వారం సుమారు 3291 సైబర్ నేరాల కేసులు నమోదవుతున్నాయంటూ బాంబు పేల్చింది.

నగదు లేకుండా చేసే లావాదేవీలపై ప్రజల్లో నమ్మకం పెరగడంతో ప్రతి చోటా డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాత తీసుకొచ్చిన యూపీఐ పేమెంట్లు భారతదేశంలో లావాదేవీల విప్లవం మొదలైంది. అయితే మంచి ఉన్న చోటే చెడు ఉంటుందన్న చందాన డిజిటల్ పేమెంట్లు ద్వారా మోసగించే వారి సంఖ్య పెరుగుతుంది.

దీన్ని అరికట్టడానికి ప్రభుత్వాలు వేగంగా చర్యలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిగత సిస్టమ్స్‌ను భద్రపరచడం, అలాగే ఆ సిస్టమ్స్‌ను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయడం, రౌటర్లు, ఇంటర్నెట్ కనెక్షన్ల వంటి బలహీనమైన ప్రదేశాలను బలోపేతం చేయాలని సూచిస్తున్నారు.

Exit mobile version