మట్టి వినాయకులను పూజిస్తాం పర్యావరణాన్ని రక్షిస్తాం

మట్టి వినాయకులను పూజిస్తాం పర్యావరణాన్ని రక్షిస్తాం

IMG 20250825 WA0013వినాయక చవితి పండుగను పర్యావరణ అనుకూలంగా జరుపుకుందాం

ప్రిన్సిపాల్ డాక్టర్ బి రమేష్

జమ్మికుంట ఆగస్టు 25 ప్రశ్న ఆయుధం

బుధవారం నుండి మొదలుకానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో NSS (జాతీయ సేవా పథకం) ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.రమేష్ అధ్యక్షతన సోమవారం ముందస్తు వినాయక చవితి పండుగ సంబరాలు జరుపుకున్నారు ప్రిన్సిపాల్ రమేష్ విద్యార్థులు పర్యావరణ హితమైన మట్టి వినాయకులను తయారు చేసి పువ్వులు పత్రాలతో అందంగా తీర్చిదిద్దారు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. రమేష్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మన అందరి భాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. సీసం, క్రోమియం, పాదరసం వంటి మూలకాలు భూమిలో చేరడం వల్ల మానవుడు తీసుకొనే ఆహారం తో మనిషిలోకి విష రసాయానాలు చేరుతున్నాయన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ఫ్యారిస్ తో తయారు చేసే విగ్రహలు నీటిలో కరగడానికి సంవత్సరాలు పడుతుందని అన్నారు. మట్టి తో తయారు చేసే విగ్రహాలు నీటిలో త్వరగా కరుగుతాయన్నారు మట్టి వినాయకులను పూజిస్తాం పర్యావరణాన్ని రక్షిద్దాం అని పిలుపునిచ్చారు మట్టి గణపతులను వినియోగించే విధంగా విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పంచాలన్నారు. ఈ కార్యక్రమంలో స్టాప్ సెక్రటరీ డాక్టర్ గణేష్, అకాడమిక్ కో – ఆర్డినేటర్ డాక్టర్ రాజేంద్రం, NSS ప్రోగ్రాం ఆఫీసర్లు Dr. ఎంబాడి రవి. లోఖండే రవీందర్ , అధ్యాపకులు Dr. శ్యామల, Dr. కె మాధవి, వి.కిరణ్ కుమార్, P. శ్రీనివాస్ రెడ్డి . మమతా. Dr.పీ.సుష్మ, Dr. పీ.రవిప్రకాశ్, Dr. శ్రీనివాస్, రమేష్, ప్రశాంత్, సాయి, వాలంటర్లు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment