సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ గా ఎన్నికైన వై. శ్రీనివాస్ రెడ్డి

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్సి నవంబర్
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి ఖమ్మం పార్లమెంటు సభ్యులు రఘురాంరెడ్డికీ కాంగ్రెస్ జిల్లా రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన శ్రీనివాస్ రెడ్డి
కొత్తగూడెం కేంద్రంగా కొవ్వూరు రైల్వే జంక్షన్, తిరుపతికి భద్రాచలానికి విజయవాడకు హైదరాబాదుకు నూతన రైళ్ల కోసం కృషి శ్రీనివాసరెడ్డి అన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు సికింద్రాబాద్ డివిజన్ కమిటీ మెంబర్ గా కొత్తగూడెం కు చెందిన కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వై. శ్రీనివాస్ రెడ్డి కి ప్రభుత్వం తరఫుననామినేటెడ్ పదవి దక్కింది.ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తనమీద నమ్మకం ఉంచి రైల్వే బోర్డు మెంబర్ గా నామినేట్ చేసిన గౌరవ ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి కి మరియు రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.కొత్తగూడెం కేంద్రంగా కొవ్వూరు రైల్వే లైన్ తో పాటు రైల్వే జంక్షన్ ఏర్పాటుకు మరియు ప్రముఖ పుణ్యక్షేత్రాలు అయిన దక్షిణయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం కు రైల్వే లైను అదేవిధంగా తిరుపతికి కొత్తగూడెం నుండి ప్రత్యేక రైలు, కరోనా సందర్భంగా నిలిపివేసిన కొత్తగూడెం నుండి విజయవాడకు వెళ్లే రైలు దాంతో పాటుగా కొత్తగూడెం నుంచి కొల్లాపూర్ ఎక్స్ప్రెస్ తదితర రైళ్ళను పునరుద్ధరణ చేయాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు మరియు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు త్వరలోనే కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్గా ఎన్నికైన శ్రీనివాస్ రెడ్డిని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతరపెద్దలు, శ్రేయోభిలాషులు అభినందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment