యాదగిరిగుట్ట కరెంట్ సబ్ స్టేషన్ లో లైన్ మెన్ ల ఆగడాలు…!! చోద్యం చూస్తున్న అధికారులు…!

*యాదగిరిగుట్ట కరెంట్ సబ్ స్టేషన్ లో లైన్ మెన్ ల ఆగడాలు… చోద్యం చూస్తున్న అధికారులు…*

దగిరిగుట్ట పట్టణంలో గల కరెంటు సబ్ స్టేషన్ లో ఎలక్ట్రికల్ ఉద్యోగుల ఆగడాలకు హద్దే లేకుండా పోయింది. అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. స్థానికంగా సబ్ స్టేషన్ లో పనిచేసే ఇద్దరు లైన్ ఇన్స్పెక్టర్లకు చార్జింగ్ కార్లు ఉన్నాయి. అవి ఇంటి దగ్గర పెట్టుకుంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని అనుకున్నారో ఏమో కానీ నిత్యం సబ్ స్టేషన్ కి వచ్చిన తర్వాత సబ్ స్టేషన్ లో ఉన్న కరెంటు మీటర్ నుండి తీసుకొని వారి కార్లకు చార్జింగ్ పెట్టుకుంటున్నారు. ఆ విషయం తెలుసుకుని రిపోర్టర్లు వెళ్లి స్థానిక ఏఈ ని అడగగా ఫోన్లో చార్జింగ్ లేకపోతే ఎలా పెట్టుకుంటామో కారులో కూడా ఆ విధంగా పెట్టుకోవచ్చు అని సమాధానం చెప్పడంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికైనా జిల్లా స్థాయి ఎలక్ట్రిసిటీ అధికారులు దృష్టి సారించి ఎవరైతే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు వారిపై మరియు వారిని సమర్థించిన ఏ ఈ పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు…

Join WhatsApp

Join Now

Leave a Comment