ఈనెల 24 న యాదవ వన సమారాధన ను జయప్రదం చేయండి

సమారాధన
Headlines in Telugu
  1. యాదవ వన సమారాధన: ఈనెల 24 న ఖమ్మంలో బృహత్తర కార్యక్రమం
  2. జిల్లా యాదవ కుటుంబాలకు పిలుపు: వన సమారాధనను విజయవంతం చేయండి
  3. రాజకీయాల కతీతంగా యాదవుల ఘనసంఘం: వన సమారాధన వేడుక
  4. అనంతకాలం కొనసాగుతున్న సంప్రదాయానికి కొత్త అధ్యాయం
  5. వన సమారాధనలో ప్రముఖుల హాజరు: యాదవ నాయకుల కార్యాచరణ

కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర, జిల్లా అఖిల భారత యాదవ మహాసభ నాయకులు 

ఈనెల 24 ఆదివారం రోజున యాదవుల వన సమారాధన కార్యక్రమం ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఖమ్మం చెరుకూరి గార్డెన్స్ లో జరుగుతుందని, ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రతి యాదవ కుటుంబం పాల్గొని జయప్రదం చేయవలసిందిగా జిల్లా అఖిలభారత యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు మచ్చ శ్రీనివాస్ యాదవ్ , గౌరవ అధ్యక్షులు మేకల మల్లి బాబు యాదవ్ , జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య , జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ పిలుపు నిచ్చారు . రామకృష్ణ ఫంక్షన్ హాల్ లో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా రాష్ట్ర నాయకులు యాదవ వనభోజనాల కరపత్రాలు ఆవిష్కరణ చేశారు . ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశం లో వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీకమాసం లో జరుపుకుంటున్న విదంగా ఈ సంవత్సరం కూడా యాదవ వన సమారాధన కార్యక్రమం ఈ నెల 24 , ఆదివారం నాడు జరుగుతుందని , యుగయుగాల నుండి వనభోజనాల కార్యక్రమం యాదవుల చేత ప్రారంభించబడిందని , ఆనవాయితీగా ప్రతి సంవత్సరం లాగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా , ఎంతమంది అడ్డంకులు చెప్పినప్పటికీ ఈ కార్యక్రమం సజావుగా సాగుతుందని , రాజకీయాల కతీతంగా ప్రాంతాల కతీతంగా ప్రతి యాదవులు తమ కుటుంబాలతో పాల్గొనాలని అన్నారు . ముఖ్యఅతిధులుగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ , ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కురుమ , జాతీయ కార్యదర్శి ఆర్. లక్ష్మణ్ యాదవ్ , రమేష్ యాదవ్ , లోకేష్ యాదవ్ వాగదాని పుల్లారావు యాదవ్ , చిన్నo మల్లేష్ కురుమ , పగడాల మధు

తదితరులు పాల్గొంటారని తెలిపారు . ఈ కార్యక్రమంలో లోడిగ వెంకన్న , చేతుల నాగేశ్వరరావు , దుబాకుల వెంకటేశ్వర్లు , దుబాకుల శ్రీనివాస్ , బమ్మిడి శ్రీనివాస్ , బండారు ప్రభాకర్ , కన్నబోయిన రవి , బొంతల అశోక్ , మెండెం వెంకటేశ్వర్లు , నన్నే పోయిన పద్మ , బొల్లి కొండలు , తెల్లబోయిన రమణ , కాసు వెంకటేశ్వర్లు , కనకబండి విజయలక్ష్మి , బాతులు సుధాకర్ , జోనబోయిన పాపయ్య , తోడేటి లింగరాజు , మెండెం శ్రీనివాస్ , పగడాల మధు , మారుతి ఎట్టయ్య , బట్టు కోటేశ్వరరావు , పొదిలి సతీష్ , సత్తి వెంకన్న , మారుతి వెంకటేశ్వర్లు మరియు తదితరులు పాల్గొన్నారు .

Join WhatsApp

Join Now