అంకాపూర్ వైదిక ధ్యాన యోగ ఆశ్రమంలో యజ్ఞాలు, భగవద్గీత పారాయణం*

*అంకాపూర్ వైదిక ధ్యాన యోగ ఆశ్రమంలో యజ్ఞాలు, భగవద్గీత పారాయణం*

*ఆధ్యాత్మిక ప్రచారకుడు కంకణాల రాజేశ్వర్*

ఆర్మూర్ (ప్రశ్న ఆయుధం) ఆర్ సి

ఆర్మూర్ మండలం అంకాపూర్ వైదిక ధ్యానయోగ ఆశ్రమంలో ఉదయం గాయత్రీ యజ్ఞం సాయంత్రం మృత్యుంజయ మహా యజ్ఞంతో పాటు శ్రీమధ్భగవద్గీతలోని రోజుకొక అధ్యాయాన్ని రెండు పూటలా పారాయణం చేస్తూ తెలుగులో వివరిస్తున్నట్లు ఆధ్యాత్మిక ప్రచారకుడు కంకణాల రాజేశ్వర్ గురువారం తెలిపారు. 10వ రోజు పదవ అధ్యాయం విభూతి యోగాన్ని పారాయణం చేశారు. అనంతరం వైదిక పురోహితులు శ్రీధరానంద భారతి స్వామి, వేద పునీతానంద భారతి స్వామి సత్సంగాన్ని కొనసాగిస్తూ ఈ విశ్వంలో ఉన్న ప్రతి జీవి, ప్రతి పదార్థం తనలో నుంచే ఉద్భవించిందని, తనలోనే అంతమైపోతుందని శ్రీకృష్ణుడు వివరించిన విషయాన్ని తెలిపారు. భగవంతుడు కేవలం గుడిలోనో, విగ్రహం లోనో కాకుండా, ప్రతి చోటా, ప్రతిరూపంలో ఉన్నాడని ఆయన వైభవాన్ని అర్థం చేసుకోవడం ద్వారా సంశయాలు తొలగిపోయి పరిపూర్ణ భక్తి మార్గా న్ని అనుసరించవచ్చని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు. మనం ఏ పని చేసినా పూర్ణమైన నమ్మకంతో చేయాలని భగవద్గీత వివరిస్తుందని అన్నారు. ఈ యజ్ఞం భగవద్గీత పారాయణ కార్యములో ఇందూరు జిల్లా నుండే కాకుండా ఇరుగుపొరుగు జిల్లాల నుండి యజ్ఞ దంపతులు భక్తులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment