సామాజిక సేవలో యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ 

సామాజిక సేవలో యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్

ప్రశ్న ఆయుధం డిసెంబర్ 29: కూకట్‌పల్లి ప్రతినిధి

యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2025 క్యాలెండర్ ఆవిష్కరించిన కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ

సమాజం కోసం, సామాజిక సేవలో ఎల్లప్పుడూ యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్టు సభ్యులు ముందుంటారని కొనియాడారు. ట్రస్ట్ చైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ బండి రమేష్ ని శాలువాతో సన్మానించారు.చలివేంద్రం మెడికల్ క్యాంప్స్, ఉచిత పుస్తకాల పంపిణీ, గిఫ్ట్ ఆర్టికల్స్ ఫర్ డిసేబుల్డ్ చిల్డ్రన్, వృద్ధులకి ఆహారం పంపిణీ, బెడ్ షీట్స్ డిస్ట్రిబ్యూషన్ , అనాథ పిల్లలకు ఉచిత భోజనం మరియు పుస్తకాలు మందులు పండ్లు పంపిణీ వంటి చాలా కార్యక్రమాలు నిర్వహించాం అని ఉదయ్ గుర్తుచేశారు. ఇలాగే మున్ముందు మరిన్ని కార్యక్రమాలు కూడా చేపడతామని తెలిపారు సామాజిక కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలు సైతం చురుకుగా పాల్గొంటున్నారని రమేష్ ఉదయ్ కిరణ్ ని అభినందించారు.ఈ కార్యక్రమంలో యలమంచి ఉదయ్ కిరణ్ ట్రస్ట్ సభ్యులు, నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now