మియాపూర్ బోనాల మహోత్సవాల్లో పాల్గొన్న యలమంచి ఉదయ్ కిరణ్..

*మియాపూర్ బోనాల మహోత్సవాల్లో పాల్గొన్న యలమంచి ఉదయ్ కిరణ్..*

*ప్రశ్న ఆయుధం,జులై 21 శేరిలింగంపల్లి,ప్రతినిధి*

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బోనాల పర్వదినాన్ని పురస్కరించుకొని మియాపూర్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఘనంగా బోనాల వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మియాపూర్ జనరల్ సెక్రటరీ మరియు యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్టు ఛైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు.శ్రీ శ్రీ శ్రీ మహంకాళి అమ్మ తొట్టెల శోభాయాత్ర మీసేవా ప్రభుత్వ పాఠశాల రోడ్, మియాపూర్ ఆర్గనైజర్ల ఆహ్వానంపై యలమంచి ఉదయ్ కిరణ్ , రాంచందర్ గౌడ్, శరత్, వంశీ, వినోద్, ప్రవీణ్, రత్నాచారి, నాగసాయి, తులసి, అభిజీత్, సతీష్, సింహాచలం తదితర యువజన నాయకులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని దినేష్ గౌడ్ ఆధ్వర్యంలోని మియాపూర్ యూత్ వింగ్ భక్తిశ్రద్ధలతో నిర్వహించింది. ఇది మియాపూర్ ప్రజల ఐక్యతను, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించింది. హేమాదుర్గ ఆలయంలో బోనాల ఉత్సవం ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ బండి రమేష్ , యలమంచి ఉదయ్ కిరణ్, శరత్, ఎంఆర్‌కే చౌదరి, వంశీ, వినోద్, తులసి, ప్రవీణ్, రత్నచారి, నాగసాయి, సతీష్, అభిజీత్, వాసు, సింహాచలం తదితరులు సంప్రదాయబద్ధంగా పాల్గొన్నారు. మియాపూర్ గ్రామ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవం ఘనంగా సాగింది.టీఎన్ నగర్ బోనాల సంబరాలు పోచమ్మ తల్లి దేవాలయం: టీఎన్ నగర్ నిర్వాహకులు సంజయ్, నరసింహులు, బాబు, మాహి, అశోక్, ప్రవీణ్, కాశి, రాజేశ్ ఆహ్వానంపై యలమంచి ఉదయ్ కిరణ్ , రత్నాచారి, నాగసాయి, తులసి తదితర యువజన సభ్యులతో కలిసి ఆలయ కార్యక్రమాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. సంప్రదాయ బోనాలతో, కోలాటలతో, అమ్మవారి పాటలతో తెలంగాణ జానపద సాంప్రదాయాలకు జీవం పోసారు.ఈ బోనాల పర్వదినం మన తెలంగాణ సమైక్యతకు, సంప్రదాయాలకు నిదర్శనంగా నిలిచింది. “బోనాలు అనేవి మన సంస్కృతి సంపదకు నిలువెత్తు గుర్తింపు. ఈ పండుగలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడమే కాదు, సమాజంలో ఐక్యతను, సేవా ధర్మాన్ని చాటే సందర్భం కూడా. యలమంచి ఉదయ్ కిరణ్, మియాపూర్ జనరల్ సెక్రటరీ , ట్రస్టు చైర్మన్అందరికీ బోనాల శుభాకాంక్షలు. మన సంస్కృతి మన గర్వం మన పండుగ మన ఐక్యత ప్రతీక అని ఆయన తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment