జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన యం.సురేష్

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్ సి ఇంచార్జ్ సెప్టెంబర్ 05(ప్రశ్న ఆయుధం న్యూస్)

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులకు గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఝరాసంగం మండలం క్రిష్ణాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల నుండి యం.సురేష్ ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డును పొందారు. తన సేవలను గుర్తించి ఎంపిక చేసినందుకు మండల విద్యాధికారి,జిల్లా అధికారులకు ధన్యవాదాలు తెలుపుతూ, విద్యార్థుల అభివృద్ధికై మరింత కృషి చేసేలా బాధ్యత పెరిగిందని సురేష్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, పార్లమెంటు సభ్యుడు రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, జిల్లా అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, టిఎస్ఐఐసి చైర్మన్ నిర్మలజయప్రకాష్ రెడ్డి, డి.ఆర్.ఓ. తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now