యాసంగి పంటలకు ప్రతి ఎకరాకు నీరు అందించాలి

యాసంగి పంటలకు ప్రతి ఎకరాకు నీరు అందించాలి

– నీరు అందించకుంటే వేలాది రైతులతో కలిసి ఉద్యమం

– ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

దుబ్బాక ప్రతినిధి,డిసెంబర్29

మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ లోని దుబ్బాక ప్రధాన కాలువల పనులు అసంపూర్తిగా ఉన్న వాటిని శుక్రవారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దుబ్బాక ప్రధాన కాలువలు శిలాజినగర్, అచ్చుమాయపల్లి, ఆరేపల్లి, పోతారం, గంభీర్ పూర్, రఘోత్తంపల్లి, పలు గ్రామాల కాలువ పనులు అసంపూర్తిగా నిలిచాయన్నారు.గతంలో నిర్మించిన కాలువలు పిచ్చి మొక్కలు,మట్టితో నిండిపోయాయని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని యాసంగి లో ప్రతి ఎకరాకు సాగు నీరు అందించాలన్నారు.కాలువలు పూర్తి చేసి చెరువులు, కుంటలకు,పంట పొలాలకు సాగు నీరు విడుదల చెయ్యాలి లేని పక్షంలో మల్లన్నసాగర్ నుండి హైదరాబాద్ కు తరలించే నీటిని వేలాది మంది రైతులతో కలిసి ఉద్యమంతో అడ్డుకుంటామని హెచ్చరించారు. తహసిల్దార్ కార్యాలయాలు అవినీతికి నిలయంగా మారాయని ఎమ్మెల్యే ఆరోపించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now