చెన్నూరు రిజర్వాయర్‌ను పరిశీలించిన: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.

*చెన్నూరు రిజర్వాయర్‌ను పరిశీలించిన: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.*

*జనగామ జిల్లా:*

*పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామంలో ఉన్న ప్రధాన నీటి వనరుల్లో ఒకటైన చెన్నూరు రిజర్వాయర్‌ను పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి పరిశీలించారు.* రిజర్వాయర్ యొక్క నీటి నిల్వ స్థితి, ప్రస్తుత పరిస్థితులు, సాగునీటి సరఫరా సామర్థ్యం, భవిష్యత్తు అవసరాలను గురించి వారు సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు సాగునీటి కొరత లేకుండా చూసే క్రమంలో రిజర్వాయర్ కీలక పాత్ర పోషిస్తోందని,అందువల్ల దీని నిర్వహణ, శుభ్రత, గట్టి నిర్మాణం తదితర అంశాలను కచ్చితంగా పరిశీలించి, అవసరమైన అభివృద్ధి పనులకు తగిన నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం దృష్టి సారించనుంది తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కారుపోతుల శ్రీనివాస్, రైతులు, తదితరులు,పాల్గొన్నారు…

Join WhatsApp

Join Now