Site icon PRASHNA AYUDHAM

సొంత నిధులతో కెనాల్ క్లీనింగ్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని..

IMG 20250730 WA1642

సొంత నిధులతో కెనాల్ క్లీనింగ్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని..

మహబూబాబాద్ జిల్లా:

పాలకుర్తి నియోజక వర్గం,పెద్దవంగర మండలం,వడ్డేకొత్తపల్లి గ్రామంలో సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి స్వంత ఖర్చులతో కెనాల్ క్లినింగ్ పనులను ప్రారంభించారు.* గ్రామ ప్రజల నుంచి వచ్చిన వినతిని సానుకూలంగా పరిగణనలోకి తీసుకుని వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఈ రోజు ప్రత్యేకంగా వడ్డేకొత్తపల్లి గ్రామానికి చేరుకుని కెనాల్ క్లినింగ్ పనులకు కొబ్బరికాయ కొట్టి శుభారంభం చేశారు.ఈ కార్యక్రమంలో *టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సిరెడ్డి పాల్గొని వడ్డేకొత్తపల్లి కెనాల్ నుంచి చిన్న చెరువు వరకు సాగు నీరు దిగలేని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, మురుగు, మట్టి, చెత్త తొలగించి కాలువను శుభ్రపరచే పనులను చేపట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యలే నా సమస్యలు,ప్రభుత్వ సహాయం ఆలస్యం అయినా,ప్రజాప్రతినిధిగా నా బాధ్యత నెరవేర్చేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని,కేవలం అధికారికంగా కాకుండా, వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుని ఈ పనులు చేపట్టానని పేర్కొన్నారు.టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సిరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గారి స్పందన, ప్రజల పట్ల గల బాధ్యతాయుత వైఖరి యశస్విని రెడ్డి గారి నాయకత్వానికి అద్దంపడుతున్నాయని,కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు సేవ చేయడం మా నైతిక బాధ్యత, అని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామస్థులు,రైతులు,మహిళా సంఘాల ప్రతినిధులు,యువత పాల్గొన్నారు.

Exit mobile version