Headlines:
-
“జగన్ బెయిల్ రద్దు వాదనపై వైసీపీ కొత్త ఆరోపణలు”
-
“ఆస్తుల వివాదం పై వైసీపీ లో అంతర్గత వివాదాలు గుప్పుమన్నాయి!”
-
“వైసీపీ నాయకులు జగన్ పై కుట్ర వాదనలతో ప్రజల మనస్తత్వంపై విమర్శలు”
ఆస్తుల వివాదంలో తల్లి, చెల్లిని కోర్టుకు లాగిన జగన్ రెడ్డి బెయిల్ రద్దు కు కుట్ర జరిగిందందటూ పార్టీ నేతలో దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. తనపై తల్లి, చెల్లి కుట్ర చేశారంటూ ఆయన బాధపడి ఆస్తుల్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించకున్నారని పార్టీ కొత్తగా పక్క వాయిద్యాలు ప్రారంభించారు. ప్రజల్ని వీరు ఎంత అమాయకంగా చూస్తారో.. జగన్ రెడ్డిని నమ్మేవారిని ఎంత అల్పులుగా చూస్తారో ఈ వాదనతోనే అర్థమైపోతుంది.
అసలు బెయిల్ రద్దు అన్నదే వైసీపీ తెచ్చిన మాట
ఆస్తుల వివాదంలో అసలు బెయిల్ రద్దు అనేమాట రాలేదు. రఘురామకృష్ణరాజును కొట్టినప్పుడు ఆయన కోర్టుకెళ్లారు. ఎన్నోబెయిల్ షరతుల ఉల్లంఘనలు ఉన్నప్పటికీ సీబీఐ ఎలాంటి వాదనలు వినిపించకుండా అంతా కోర్టు ఇష్టం అని తేల్చేయడంతో ఆయన బయటపడ్డారు. మళ్లీ ఆ అంశం తెరపైకి రాలేదు. కానీ ఇప్పుడు వైసీపీనే జగన్ బెయిల్ రద్దు చేసేందుకు షర్మిల కుట్ర పన్నారని సొంత తల్లి, చెల్లిపై నిందలు వేస్తూ విషయాన్ని బయటకు తెచ్చారు.
ఈడీ ఎటాచ్‌లో షేర్లు లేవు మరి ఎలా బెయిల్ రద్దు పిటిషన్ వేస్తారు ?
సరస్వతి కంపెనీ భూములు అటాచ్లో ఉన్నాయి కానీ షేర్లు లేవు అని షర్మిల నిర్మోహమాటంగా చెబుతున్నారు. అయినా వైసీపీ నేతలు ఏ మాత్రం తడుముకోకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎంత కాలం చేస్తారో కానీ ఈ వాదనను ప్రజలను కనీసం పరిగణనలోకి తీసుకుంటున్నారా… జగన్ రెడ్డి నికృష్టాన్ని నోరెళ్లబెట్టి చూస్తున్నారా అన్నది ఆ పార్టీ నేతలే విశ్లేషించుకోవాల్సి ఉంది.
జగన్ రెడ్డి బెయిల్ రద్దు ఎవరికి అవసరం ?
జగన్ రెడ్డిని జైలుకు పంపేందుకు కుట్రచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కానీ సింగడు లోపల ఉన్నా.. బయట ఉన్నా పెద్ద తేడా ఉండదు. బయట ఉంటేనే చిల్లర పనులు చేసుకుని పరువు తీసుకుంటారు. ఇంత కాలం చేస్తుంది అదే. వికృత మనస్థత్వంతో పిచ్చి పనులు చేసుకుని తనను తాను పాతాళంలోకి నెట్టుకునే జగన్ రెడ్డి జైలుకు వెళ్లాలని ఎవరైనా కోరుకుంటారా ?. ఆయనకే భయం పట్టుకుంది. దాన్ని కుటుంబంపై నిందలు వేయడానికి వాడుకుంటున్నారు.