వామపక్ష దిగ్గజం, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) మృతిచెందడం నన్ను తీవ్ర దిగ్భ్రంతికి గురిచేసింది. సీతారాం ఏచూరి మరణం సామ్యవాద, ప్రజాస్వామ్య , వామపక్ష, పౌరహక్కుల భావజాలాలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందనడంలో ఎటుంటి అతిశయోక్తి లేదు. సీతారాం ఏచూరి లేని లోటు.. ప్రజాపోరాటాల్లో తప్పకుండా కనిపిస్తుందని చెప్పవచ్చు. సీతారాం ఏచూరి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో అడుగుపెట్టిన ఏచూరి దాదాపు నాలుగు దశాబ్దాలుగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఏచూరిగారు చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకం. సీతారాం ఏచూరి లేని దేశ రాజకీయాలకు తీరని లోటుగా చెప్పవచ్చు. సీతారాం ఏచూరి మరణం భారత కార్మిక లోకానికి, లౌకికవాద, ప్రజాస్వామ్య భావజాలాలకు తీరని లోటు అని చెప్పకతప్పదు. సాధారణ వ్యక్తి స్థాయినుంచి భారతదేశ రాజకీయాల్లో అత్యంత విశ్వసనీయ ప్రజాహక్కుల గొంతుకలలో ఒకరుగా సీతారాం ఏచూరి నిలిచారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటులోనూ, 2004లో యూపీఏ ప్రభుత్వ ఏర్పాటులో అత్యంత కీలంగా వ్యవహరించి దేశ రాజకీయాల్లో లౌకికవాదాన్ని నిలిపేందుకు కృషి చేశారు. సామ్యవాద, ప్రజాస్వామ్య భావాలు, రాజ్యాంగ విలువలు కలిగిన ప్రజానాయకుడు సీతారం ఏచూరి అనడంలో ఎలాంటి సందేహం లేదు. విద్యార్థి నాయకుడిగా, కమ్యూనిస్టు పార్టీకి కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యునిగా అంచలంచలుగా ఎదిగి ప్రజాపక్షం వహించి ప్రజల సమస్యల కోసమే ఆ జన్మాంతం పోరాటాలు చేసిన నిజమైన ప్రజాసేవకుడు ఏచూరి. రాజ్యసభ సమావేశాల్లో క్రమంతప్పకుండా పాల్గొనే సీతారం ఏచూరి.. మతతత్వం, నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా చేసిన ప్రసంగాలు చరిత్రలో నిలిచిపోతాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క.