ఐఎంఏ ఆధ్వర్యంలో యోగ క్లాస్

ఐఎంఏ ఆధ్వర్యంలో యోగ క్లాస్

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

కామారెడ్డి ఐఎంఏ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం యువ క్లాసు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉదయం 6:30 నుండి 8:30 వరకు సాగించారు. కార్యక్రమానికి యోగా టీచర్లు దత్త క్రియా యోగా సెంటర్ కామారెడ్డి నుండి 5 మంది సభ్యులు హాజరయ్యారు. డీకే వై టీచర్లు మాణిక్యరావు, భాస్కరరావు, డాక్టర్ మాధవి మూర్తి ( మాస్టర్స్ ఇన్ యోగ ఫ్లోరిడ యూనివర్సిటీ ), ప్రేమలత

డాక్టర్ రాధ యోగ క్లాసు కు వయసుతో సంబంధం లేకుండా పాల్గొన్నారు. కింద కూర్చొని వారికి కుర్చీలను ఏర్పాటు చేశారు. ఈ యోగా క్లాసులో సునాసనమైన ఆసనాలు, చేతుల ఎక్ససైజ్, ప్రాణాయం, శ్వాస తీసుకోవడం వదలడం, ఎక్ససైజ్, మెడిటేషన్ తదితర వాటి ఆసనాలు చేయడం వల్ల మన శరీరంలో యాక్టివేషన్ పెరిగి జ్ఞాపకశక్తి, స్కిన్ చెడిపోకుండా ఉండడం, శరీరం దృఢంగా ఉండడం తదితర లాభాలు కలుగుతాయని ఐఎంఎ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాధా రమణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరవింద్ కుమార్, కోశాధికారి డాక్టర్ పవన్, సీనియర్ డాక్టర్లు రమణ కుమార్, డాక్టర్ఉమా రెడ్డి, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ నవీన్, డాక్టర్ శ్రీ లీల, డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment