యాచకులకు భోజన ప్యాకెట్లు అందించిన పెరుగు ప్రసాద్..

*యాచకులకు భోజన ప్యాకెట్లు అందించిన పెరుగు ప్రసాద్..*

ఖమ్మం జిల్లాలో రోడ్ల వెంట తిరుగుతున్న యాచకులకు తల్లాడ మండలంలోని మంగాపురం ప్రధాన రహదారి పక్కన ఉన్న ఆంటోనీ స్టూడియో అధినేత పెరుగు ప్రసాద్ యాదవ్ భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. తన కారులో భోజన ప్యాకెట్లను ఉంచి రోడ్ల వెంట ప్రయాణించే యాచకులకు భోజనం ప్యాకెట్లు అందించారు. తల్లాడ నుండి ఖమ్మం వరకు వెళ్లి ప్రధాన రహదారి వెంట ఉన్న బిచ్చగాళ్లకు వాటిని అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ తన సొంత ఖర్చులతో ప్రతి శనివారం యాచకులకు ఇలా భోజనం అందిస్తానని పేర్కొన్నారు. తాను ఆ ఒక్క రోజు ఉపవాసం ఉండి యాచకులందరికీ భోజనం అందించిన అనంతరం ఉపవాసం విడుస్తానని పేర్కొన్నారు. యాచకులు దేవుళ్ళతో సమానమని, మానవసేవే మాధవసేవగా భావించి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు.*

Join WhatsApp

Join Now

Leave a Comment