*మీరు హిందీ సినిమా “ఫులే” చూడాలి*
ప్రశ్న ఆయుధం మే 5: జ్యోతిరావు ఫూలే కష్టాల జీవితంపై సినిమాను మేము ఫ్యామిలీతో సహా కల్సి ఆదివారం ముంబైలోని బాంద్రా టాకీస్ లో చూశాం. చిత్రంలో ఫూలే అవిశ్రాంత దేశీయ మేధో ప్రయత్నాలు వాటిని కార్యాచరణతో కలిపారు. ఇది డాక్టర్ అంబేడ్కర్ కు భారతదేశంలోని బ్రాహ్మణీయ కులవ్యవస్థను నాశనం చేయడానికి బలాన్ని ఇచ్చిందనడంలో సందేహం లేదు. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఫూలే దంపతులు అమానవీయ కులవర్గ అసమానతలకి విరుద్ధంగా చాలా కాలం పోరాడారని, పరిణామం వారి జీవితాలు దుర్భరమైన వాస్తవం ప్రజలు గ్రహిస్తారు. అట్టి చరిత్ర వెల్లడవుతుంది. విద్యార్థులకు చదివిన జ్ఞాపకాలు మేల్కొంటాయి. సినిమా చూడటం వల్ల యువతరం భవిష్యత్ సామాజిక మార్పు దిశను అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా దోహద పడుతుంది. జ్యోతిబా సావిత్రిమాయి ఫూలేల పోరాటంలో ఫాతిమా షేక్ మద్దతు ఎలా కీలక పాత్ర పోషించార నేటువంటి సంఘటనలను “ఫూలే” చిత్రం స్పష్టంగా చిత్రీకరించింది. ఇది యువతకు ఖచ్చితంగా చాలా ప్రేరణను అందిస్తుంది. వారి సామాజిక సాంస్కృతిక ఉద్యమం దేశానికి ఓ మైలు రాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 2.48 కోట్లకు పైగా వసూలు చేసిందంటారు. ఐతే సినిమా అభిమానులు ఉద్యమాభిమానులు తప్పకుండా థియేటర్లకు వెళ్లి ఈ చిత్రం చూడాలని అభ్యర్థిస్తున్నాం.