మహిళలూ.. మీరంతా నాకు స్ఫూర్తి: కేటీర్
తెలంగాణలో వివిధ సమస్యలపై పోరాడుతున్న మహిళలు తనకు స్ఫూర్తి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ‘సమ్మక్కలు, సారక్కలు. మొక్కవోని ధైర్యంతో ముందుకురుకుతున్న ఐలమ్మలు. అలుపెరగని పోరాటం చేస్తున్న రుద్రమ్మలు. మీరంతా నాకు స్ఫూర్తి. ఒక సోదరుడిగా మీకు అండగా ఉంటాను’ అని Xలో ట్వీట్ చేశారు. హైడ్రా కూల్చివేతలు, గురుకులాలు, బెటాలియన్ కానిస్టేబుళ్ల సమస్యలు, దిలావర్ పూర్ ఇథనాల్ పరిశ్రమపై నిరసనలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు.