*మేడ్చల్ వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో శనిగపురం కు చెందిన యువడాక్టర్ మృతి…*
*మేడ్చల్ వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శనిగపురం గ్రామానికి చెందిన యువడాక్టర్ చుక్క శ్రీచరణ్ మృతిచెందారు..*
*శనిగపురం గ్రామానికి చెందిన చుక్క శ్రీనివాస్ కుమారుడైన శ్రీచరణ్ రోడ్డు ప్రమాదంలో మరణించిన వార్త తెలియగానే మహబూబాబాద్ మాజీఎంపి, బిఆర్ఎస్ జిల్లాఅద్యక్షురాలు మాలోత్ కవిత హుటాహుటిన హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి చేరుకుని మృతుని కుటుంబసభ్యులను ఓదార్చారు.*
*కష్టపడి చదివి డాక్టర్ గా స్థిరపడుతున్న సమయంలో ముప్పై సంవత్సరాలైన నిండకుండానే శ్రీచరణ్ మృతిచెందడంతో శనిగపురం గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి..*