గూగులొత్ బద్రు నాయక్ ఆంగోత్ నగేష్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు
రాష్ట్రంలో విద్యార్థులకు మెరుగైన సమీకృత విద్యాభ్యాసం అందించేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పేరిట నిర్మాణం చేపడుతుంది రాష్ట్రంలో 27 నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులకు ఇలా కాలంలో పరిమితం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తి ఏజెన్సీ గిరిజన జిల్లా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనేక సామాజిక వర్గాల ప్రజలు ఉన్నప్పటికీ ఈ జిల్లాకు కనీసం ఒక కళాశాల కేటాయించకపోవడం బాధాకర విషయం.
దీనిపై సేవాలాల్ సేన భద్రాద్రి జిల్లా తరఫున ఖండిస్తున్నాం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు నియోజకవర్గాలు ఉన్నప్పటికీ నాలుగు ఎస్టి రిజర్వేషన్ స్థానాలు ఉన్నాయి కొత్తగూడెం జనరల్ నియోజకవర్గమైన జిల్లా కేంద్రం అయినప్పటికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపించింది తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం పేరందింది ఇక్కడ ఎక్కువగా ఉండటం సరైన వసతులు సౌకర్యాలు లేకపోవడమే ఈ జిల్లా ప్రత్యేకత అయితే ఎన్ని రంగులతో కార్పొరేట్ స్థాయిని మైమరిపించే విధంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్ గిరిజన జిల్లా ఏర్పాటు చేస్తే నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుకు బాట చేసినట్టుగా ఉంటుంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం మూడు క్యాంపస్లు రాష్ట్ర మంత్రుల నియోజకవర్గం పరిమితమైనది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కళాశాల కేటాయించాలని సేవాలాల్ సేన డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంసేవాలాల్ రైతు సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు గుగులోత్ బద్రు నాయక్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నగేష్ సేవాలాల్ సేన పాల్వంచ మండల అధ్యక్షులు ధర్మసోత్ పవన్ కళ్యాణ్ నాయక్ నూనావత్ రాజ తదితరులు పాల్గొన్నారు