ఎంగిలి గ్లాసులో మద్యం పోశారని.. స్నేహితులను పొడిచిన యువకుడు!
ఎంగిలి గ్లాసులో మద్యం పోశారని తన ఇద్దరి స్నేహితులను కత్తితో పొడిచాడు ఓ యువకుడు. తెలంగాణలోని జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన చెరుకు వెంకటేష్, మల్లా మధుల బర్త్ డే సందర్భంగా గ్రామంలోని మామిడి తోటలో బర్త్ డే పార్టీ ఇచ్చారు. వారితో పాటు మద్యం తాగిన కూరపాటి రాజశేఖర్ తనకు ఎంగిలి గ్లాసులో మద్యం పోస్తారా? అని వాగ్వాదానికి దిగారు. ఈ విషయాన్ని వారు ఇంట్లో చెప్పారన్న కోపంతో వారిద్దరినీ కత్తితో పొడిచి పారిపోయాడు.