ప్రియురాలితో జల్సాలకు అలవాటుపడి సొంతింట్లోనే చోరీకి పాల్పడ్డ యువకుడు
వరంగల్ జిల్లా మిల్స్ కాలనీ పోలీస్టేషన్ పరిధిలో ఖిలా వరంగల్ పడమరకోటకు చెందిన ఆర్ఎంపీ గుర్రపు రామకృష్ణ ఈ నెల 8న ఇంటికి తాళం వేసి హైదరాబాద్లో ఓ శుభకార్యానికి వెళ్లారు
అదేరోజు అర్ధరాత్రి తిరిగి వచ్చేసరికి తాళం పగులగొట్టి బీరువాలోని 16 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
కేసు విచారణ చేస్తున్న పోలీసులు.. మంగళవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా వారిని చూసి పారిపోతున్న గుర్రపు జయంత్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా.. నేరం అంగీకరించడంతో గుర్రపు రామకృష్ణ కుమారుడిగా గుర్తించిన పోలీసులు
బాధితుడు రామకృష్ణ కుమారుడు జయంత్ నగరంలోని చైతన్య డిగ్రీ కళాశాలలో బీబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు
అదే కళాశాలలో చదువుతున్న ప్రేయసితో కలిసి జల్సా చేసేందుకు చోరీకి పాల్పడినట్లు తెలిపిన పోలీసులు
గతంలో ఇక్కడ చదువుకుంటూనే.. హైదరాబాద్‌లో ఫుడ్ కోర్టు నిర్వహించి నష్టపోవడమే కాకుండా స్నేహితుల వద్ద అప్పులు చేశాడు. దింతో చేసిన అప్పులు తీర్చేందుకు, ప్రేయసితో గడిపేందుకు ఖర్చుల కోసం కుటుంబ సభ్యులులేని సమయంలో బంగారు ఆభరణాలు అపహరించినట్టు తెలిపిన పోలీసులు
కొంత బంగారం కరిగించి అమ్ముదామని వెళ్తుండగా.. పోలీసులకు పట్టుబడ్డ నిందితుడు