*సేవలల్ స్ఫూర్తితో యువత ముందుకు నడవాలి*
*సేవల సేన రాష్ట్ర అధ్యక్షులు బానోత్ కిషన్ నాయక్*
ఖమ్మం అర్బన్ మండలం ఖానాపురం యుపిఎస్ కాలనీ సేవలాల్ మహారాజ్ ఆలయంలో సేవల సేన రాష్ట్ర అధ్యక్షులు బానోత్ కిషన్ నాయక్ ఆధ్వర్యంలో సేవలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు . సేవలాల్ మహారాజు స్ఫూర్తి తో యువత ముందుకు నడవాలని , చెడు అలవాట్లు విడిచి మంచి మార్గంలో నడవాలని తోటి వారితో ప్రేమను రాగాలతో ఉంటూ పెద్దలను గౌరవిస్తూ యువత జీవించాలని . స్థిర నివాసం లేని బంజారాలకు తండలు ఎలా ఏర్పాటు చేసుకోవాలో సమస్యలు వస్తే ఎలా పరిష్కరించుకోవాలో దారి చూపించిన మహానీయుడని కొనియాడారు . ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రవి కిరణ్ మరియు ఆర్ఐ , నాలుగోవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బిక్కు నాయక్ , తెలంగాణ గోర్ బంజారా ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు భూక్యా శోభన్ నాయక్ , కొట్టే సుధాకర్ , సేవలల్ సేన జిల్లా నాయకులు రాజ్ కుమార్ , మణికంఠ , కార్పొరేటర్ జ్యోతి రెడ్డి , భారతి చంద్రయ్య , కోలేటి రాధాకృష్ణ , వినోద్ బాబు , సురేష్ , చంద్ర , అంజయ్య , రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.