యువత విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.. పట్టణ సీఐ వరగంటి రవి

*యువత విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి*

*పట్టణ సీఐ వరగంటి రవి*

*జమ్మికుంట ఫిబ్రవరి 20 ప్రశ్న ఆయుధం*

యువత విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి అన్నారు గురువారం రోజున జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జమ్మికుంట బాలికల, కోరపల్లి ప్రభుత్వ పాఠశాల అధ్యాపకుల బృందంచే జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో సీఐ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావిభారత పౌరులని విద్యార్థి దశలోనే పిల్లలను మంచి మార్గంలో నడిపించాలని మన చుట్టూ జరుగుతున్నటువంటి కొన్ని అనైతిక వ్యవహారాలపై విద్యార్థులకు మంచి అవగాహన కల్పించి యువత డ్రగ్స్ గంజాయి లాంటి మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదని యువత ఎల్లప్పుడూ మంచి మార్గంలో నడవాలని సూచించారు ఒకప్పుడు పట్టణాల్లో, నగరాల్లో మాదకద్రవ్యాలు డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు అలవాటయ్యే యువత నేడు చాప కింద నీరు లాగా డ్రగ్స్ గంజాయి లాంటి పదార్థాలు నేడు పల్లెల్లోకి చేరుకున్నాయని తెలిపారు ముఖ్యంగా జమ్మికుంటలో రైల్వే స్టేషన్ ఉండడం వలన ఉత్తరాది రాష్ట్రాల నుండి జమ్మికుంటకు గంజాయి మాదకద్రవ్యాలను సులువుగా రవాణా చేసుకొని నేడు విద్యార్థులకు యువతకు చెడు వ్యసనాలకు అలవాటు చేస్తున్నారని ఇలాంటి కేసులు ఎన్నో మా దృష్టికి వచ్చాయని గంజాయి అలవాటు పడిన వ్యక్తి ఎంతటి నేరానికైనా వెనుకాడడని ఆ మత్తులో ఏమి చేస్తున్నామో అర్థం కాని పరిస్థితిలో ఉంటారని ఈ అలవాటున్న వ్యక్తి అనేక రోగాలకు గురై మృత్యువాత పడుతున్నారని తెలిపారు. యువకులు విద్యార్థులు ఇలాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ఎల్లప్పుడూ మంచి మార్గంలోనే నడవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎం. హేమలత, బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నల్లగొండ సదానందం బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుధాకర్ బాలుర పాఠశాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now