హార్ట్ ఎటాక్ తో యువతి మృతి

హార్ట్ ఎటాక్ తో యువతి మృతి

ప్రశ్న ఆయుధం హుజూర్ నగర్ నియోకవర్గ ఇన్చార్జి జనవరి 06

హుజూర్ నగర్ మున్సిపల్ పరిధిలోని 10 వార్డ్ కు చెందిన చికాకోళ్ళ సాత్విక (19) అనే యువతి సోమవారం షుగర్ లెవెల్స్ పెరిగి ఆ ప్రభావంతో హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందారు. సాత్విక తండ్రి శ్రీనివాసాచారి తెలిపిన వివరాల మేరకు సాత్విక హైద్రాబాద్ నిజాం కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చూదువుతుందని, గత శనివారం ఫీవర్ వచ్చి బాగా నీరసం తో హుజూర్ నగర్ లో ఒక ప్రవైట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఒకరోజు వైద్యం చేసిన ఏ మాత్రం మార్పు లేకపోవడం తో హైద్రాబాద్ కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు బాడిలో షుగర్ లెవెల్స్ 700 వరకు పెరిగాయని రిపోర్ట్ లో తేల్చారు. షుగర్ లెవెల్స్ పెరగడం ఆ ప్రభావం హార్ట్, కిడ్నీస్ పై పడటంతో చికిత్స పొందుతూ సాత్విక మృతి చెందారు.

చిన్న వయసులోనే సాత్విక మృతి ఆ కుటుంబం లో తీవ్ర విషాదం నింపింది. ఒక ప్రవైట్ టీచర్ గా పనిచేస్తున్న శ్రీనివాసాచారి కూతురు సాత్విక అర్ధాంతరంగా మృతి చెందటం పట్ల సానుభూతి తెలిపి నివాళులు అర్పించారు. ఇట్టి కార్యక్రమంలో 10 వార్డ్ కౌన్సిలర్ గుండా ఫణికుమారీ రాంరెడ్డి, జక్కుల నాగేశ్వరరావు, చిట్యాల అమర్నాథ్ రెడ్డి, భాచిమంచి చంద్రం, దుగ్గి బ్రహ్మం, తాటి శేఖర్ రెడ్డి, పశ్య కోటిరెడ్డి, ధూళిపాళ శ్రీనివాస్, అరవింద్ రెడ్డి, ప్రవైట్ ఉపాద్యాయ సంఘం నాయకులు నివాళులు అర్పించారు.

Join WhatsApp

Join Now